Manoj Mother Nirmala: మనోజ్ కావాలనే తప్పు ప్రచారం చేస్తున్నాడు 5 d ago
మనోజ్ ఫిర్యాదుకు వ్యతిరేకంగా తల్లి నిర్మల పహాడీ షరీఫ్ సీఐకి లేఖ రాసారు. తన పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేసేందుకు పెద్ద కుమారుడు విష్ణు వచ్చి కేక్ కట్ చేయించాడని, ఆ సమయంలో ఎలాంటి గొడవ జరగలేదని తల్లి నిర్మల పేర్కొన్నారు. మనోజ్ చెబుతుంది అంతా అబద్ధమంటూ నిర్మల లేఖ వెల్లడించారు. నా చిన్న కొడుకు మనోజ్కు ఇంట్లో ఎంత హక్కు ఉందో నా పెద్ద కొడుకు విష్ణుకూ అంతే హక్కు ఉందని మంచు నిర్మల అన్నారు. ఇంట్లో జనరేటర్ లో షుగర్ పోశారని మనోజ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పారు. విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదని, ఇంట్లో పనివాళ్లు మానేయడానికి విష్ణు కారణం కాదని నిర్మల క్లారిటీ ఇచ్చారు.